. . . బినోల సొసైటీ చైర్మన్ మగ్గర హన్మండ్లు
నవీపేట్, బతుకమ్మ :
రైతులు పండించే మక్కలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించి, ప్రభుత్వం అందించే మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని బినోల సొసైటీ చైర్మన్ మగ్గర హన్మండ్లు అన్నారు. నవీపేట్ మండలం బినోల సొసైటీ పరిధిలోని శాఖాపూర్ గ్రామంలో ఆదివారం మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులు తమ మక్కల తేమ శాతం 14% మించకూడదని, అలాగే ఎకరాకు 26 క్వింటల్లా 50 కిలోలు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. బినోల సొసైటీ పరిధిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేయించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కి సొసైటీ తరపున, రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగాపూర్ సర్పంచ్ దూడల శ్యామల బాల్ రాజ్ గౌడ్, లింగాపూర్ డైరెక్టర్ బాలుచందర్ గౌడ్, ఉప సర్పంచ్ ఓడ్డేన్న, సీఈఓ రమేష్, మోహన్, మోగులయ్య, పోతన్న, దేవన్న, రాజేశ్వర్, ధర్మన్న, సాయిలు, రైతులు పాల్గొన్నారు.
