గురుకులాల అధికారుల అవినీతిపై చర్యలు తీసుకోండి

0 8,988

 

. . . కాస్మెటిక్, వాషింగ్ చార్జీలను అప్పనంగా తింటున్నారు

 

. . . విద్యను బోధించాల్సిన వారు మానసికంగా హింసించడం సిగ్గు చేటు

 

. . . పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షులు కర్క గణేష్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, విద్యార్థుల మీద ప్రిన్సిపల్ ల్లు, సంబంధిత అధికారులు చేస్తున్న వసూళ్లపై, ఆర్థిక అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాంపాటి పృథ్వీ, ఎస్. అనిల్ లు అన్నారు. ఈ విషయమై నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కర్క గణేష్ తో కలిసి హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ ఆఫీసులో రాష్ట్ర సహాయ కార్యదర్శి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ కర్క గణేష్ మాట్లాడుతూ నిజామబాద్ జిల్లాలోని చాలావరకు గురుకులాల్లో (ఐసిటి) కంప్యూటర్ టీచర్స్ విద్యార్థులకు పాఠాలు బోధించకుండా ఆఫీసు కార్యకలాపాలలో నిరంతరం కొనసాగడం విద్యార్థులకు అకాడమిక్ పరంగా నష్టదాయకమన్నారు. గురుకులాల్లో ఒక ఉద్యోగానికి రెండు వేతనాలు తీసుకుంటున్నవారు ఉన్నారని తెలిపారు. కొంతమంది ప్రిన్సిపల్ ల్లు ఒక్కొక్క విద్యార్థి నుండి దాదాపు 500 రూపాయలు వసూలు చేశారని తెలిపారు. జోనల్ 2 కేంద్రంగా అక్రమ నియామకాలు ఆర్థిక లావాదేవులు జరిగాయన్నారు. రాష్ట్ర హెడ్ ఆఫీస్ కు తెలియకుండా జోన్ 2 ఆఫీసులో జీవోలను సైతం అతిక్రమించారన్నారు. విద్యార్థుల నుండి చార్జింగ్ లైట్స్, డోర్ తాళాలు, గోడ గడియారాల, నల్ల టాపుల కొరకు, ఆగస్టు 15 పర్యటన సందర్భంగా ఫరెడ్ గ్రౌండ్, ఇలా ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా ఒక్కో విద్యార్థి నుండి దాదాపు 100 నుండి 600 రూపాయలు వరకు కంజర ప్రిన్సిపాల్ వసూలు చేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం నుండి వచ్చిన కాస్మెటిక్, వాషింగ్ చార్జీలను అప్పనంగా తింటున్నారని కారణంతో విద్యార్థులకు బ్యాంకులో డబ్బు జమ చేయడం కానీ ఇక్కడ పనిచేసే ప్రిన్సిపల్ సీనియర్, జూనియర్ వైస్ ప్రిన్సిపల్, పిడి, వీరికి సహకరించే కొందరు రెగ్యులర్ ఉద్యోగుల సహకారంతో విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తూ, బ్యాంకు ఖాతాలకు కూడా డబ్బులు తీసుకుంటూ సైడ్ ఇన్కమ్ ను పొందుతున్నారన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులతోని మాట్లాడడానికి ఏదైనా లోపాలు ఉంటే హెడ్ ఆఫీస్ కి తెలియజేయడానికి విద్యార్థులకు కల్పించిన ఫోన్ స్కేల్లో కూడా విద్యార్థులకు కావలసిన సమయాన్ని, స్వేచ్ఛను ఇవ్వకుండా, వారికి సంబంధించిన ఫోన్ కార్డును కూడా విద్యార్థులకు ఇవ్వకుండా, సంబంధిత క్లాస్ లేదా హౌస్ టీచర్ల వద్ద ఉంచి ప్రిన్సిపాల్ రూమ్లో పెట్టడం వలన విద్యార్థులు తమ బాధలను తల్లిదండ్రులకు, హెడ్ ఆఫీస్ కి తెలియజేయలేక భయభ్రాంతులకు గురి అవుతుందన్నారు. విద్యార్థులు హెడ్ ఆఫీస్ కి కంప్లైంట్ చేస్తే భయభ్రాంతులకు గురి చేయడం జరిగిందన్నారు. అలాగే విద్యార్థులకు చెందాల్సిన ఆహారం,కూరగాయలు ఇతర సామాగ్రిలను ప్రిన్సిపల్, సంబంధిత అధికారులు, సిబ్బంది తమ ఇంటికి, గెస్ట్ హౌస్ కి అక్రమంగా తరలిస్తున్నారన్నారు. దాదాపు ప్రతి గురుకుల పాఠశాలలో 16 సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ పర్యవేక్షణ లేక అనేక రకాల అక్రమాలు పాఠశాల సిబ్బందికి, ప్రిన్సిపాల్ కి అలవాటుగా మారిపోయిందన్నారు. అలాగే పీఎం స్క్రీన్ నిధులను కూడా విద్యార్థులకు సౌకర్యాలు అందించకుండా దుర్వినియోగం చేస్తున్నారన్నారు. విద్యార్థులకు విద్యను బోధించాల్సిన వారు మానసికంగా హింసించడం సిగ్గుచేటన్నారు. కేవలం కంజర బాలికల గురుకులం పాఠశాల అనేది కాకుండా, జిల్లా వ్యాప్తంగా అన్ని గురుకుల పాఠశాలలో దాదాపుగా ఈ విధంగా విద్యార్థులపై దాడులు, ఆర్థిక అక్రమాలు జరుగుతున్నాయన్నారు. కాబట్టి గత నాలుగు సంవత్సరాలుగా కంజర పాఠశాల నుండి జరిగిన ఆర్థిక లావాదేవీలపై, విద్యార్థులను కూడా విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాకేష్, గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి సాయి ప్రసాద్, రాష్ట్ర నాయకులు ఎస్కే అషూర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.