27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సువేందు అధికారి పిఏ కాల్చివేత

Must read

📰 Generate e-Paper Clip

. . . కోల్ కత్తాలో ఘటన

. . . మరో వ్యక్తి కి తీవ్ర గాయాలు

 వెబ్ డెస్క్, బతుకమ్మ:

పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత  సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రాథ్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.  ఈ సంఘటన బుధవారం రాత్రి కోల్ కత్తాలో జరిగింది. చంద్రనాథ్ రాథ్ స్కార్పియో లో రాత్రి మిచేల నగర్ నుంచి తన ఇంటికి మద్యం గ్రామ్ కు వెళుతుండగా నాలుగు బైక్ ల పై వచ్చిన ఎనిమిది మంది కార్ ను చేజ్ చేశారు. ఎయిర్ పోర్టుకు మూడు కిలోమీటర్ల దూరంలో కారును బలవంతంగా ఆపీ కాల్పులు జరిపారు. చంద్రనాథ్ రాథ్ పై నాలుగు రౌండ్ల  పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చంద్రనాథ్ రాథ్ తో పాటు కార్ డ్రైవ్ చేస్తున్న  బుద్ధదేవ్ బేరాకు కూడా కడుపులో, ఛాతిలో బుల్లెట్ గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన చంద్రనాథ్ రాథ్ ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

 

Suvendu Adhikari PA shot dead

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన  డ్రైవర్ బుద్ధ దేబ్ బేరా పరిస్థితి క్రిటికల్ గా ఉండటంతో  24 పరగణాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం హెల్మెట్ లు ధరించిన వారు, పేక్ నంబర్ ప్లేట్ లు కలిగిన బైక్ లపై వచ్చిన వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. చంద్రనాథ్ రాథ్ గత ఐదు సంవత్సరాలుగా సువేంధు అధికారి వద్ధ వ్యక్తిగత సహాయకుడు గా పని చేస్తున్నట్టు తెలిసింది. భవాని నగర్ లో సువేంధు అధికారి గెలుపు లో చంద్రనాథ్ రాథ్ కీలకంగా వ్యవహరించడంతో ప్రత్యర్థి పార్టీ వారు హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. బెంగాల్ కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న సువేంధు అధికారి పిఏ హత్య రాష్ట్రంలో సంచలనం రేపింది.

Suvendu Adhikari PA shot dead

More articles

Latest article