27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నిఘా నిద్దరోతుంది

Must read

📰 Generate e-Paper Clip

  • ఇందూర్ లో ఐసిస్ కార్యకలాపాలు వెలుగులోకి
  • ఎన్ఐఏకు ఎయిర్ గన్ తో పట్టుబడిన బోధన్ వాసి
  • ఎన్ఐఏ తనిఖీల వరకు ఉగ్రమూలాలు ఉనికిని గుర్తించని నిఘా వర్గాలు

Surveillance is dormant.

నిజామాబాద్, బతుకమ్మ : దేశంలో ఉగ్రవాదం ఏరూపంలో ఉన్న దాని మూలాలు ఇందూర్ జిల్లాలో కనిపించడం సర్వ సాధారణం. అది ఆనాటి ఉమ్మడి రాష్ట్రం కావచ్చు లేదా నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావచ్చు.. నిజామాబాద్ జిల్లాలో సంఘ వ్యతిరేక శక్తుల జాడ బట్టబయలు అవుతున్నాయి. బుధవారం ఎన్ఐఏ టీం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అనిస్ నగర్ కు చెందిన వ్యక్తిని ఐసిఎస్ తో సంబంధాలు ఉన్నాయని అదుపులోకి తీసుకుని విచారించింది. అతని వద్ద ఎయిర్ గన్ దొరకడంతో అరెస్టు చేసి బోధన్ కోర్టులో హాజరు పరుచడం కలకలం రేపింది. స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం లేకుండా ఎన్ఐఏ ప్రవేశించి ఉగ్రకార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తిని అరెస్టు చేసి  తరలించిన వ్యవహరం నిజామాబాద్ జిల్లా ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ ల నిఘా వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది.

  • ఉగ్రమూలాల కేంద్రం ఇందూర్..

1990వ దశకంలో బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంగా జరిగిన అల్లర్ల మూలాలు ఇందూర్ లో వెలుగు చూసాయి. ఆనాడు మత ప్రాతిపాదికన పనిచేసే ఉగ్రవాదులు పట్టపగలు బోధన్ లో విశ్వహిందూ పరిషత్ నేతను కాల్చి చంపారు.  ఐఎస్ఐ ఎజెంట్ ఆనాటి ఘటన సూత్రదారి అజంఘోరిని పోలీసులు నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి సరిహద్ధులోని ఇబ్రహీంపట్నం వద్ద ఎన్ కౌంటర్ చేశారు. అప్పటికే అజంఘోరి ఐఎస్ఐలోకి చాల మంది యువతను రిక్రూట్ చేశాడనే నిఘా వర్గాలు గుర్తించారు. దేశంలో పేరు మోసిన బొంబాయి, కోయంబత్తూర్, హైద్రాబాద్ లోని గోకుల్ చాట్, లుంబిని పార్క్ ప్రాంతాలలో జరిగిన బాంబు పేళ్లుళ్ల లింకులు ఇక్కడ బయటపడ్డాయి. చివరకు దేశంలో అత్యంత కఠినమైన తీవ్రవాద వ్యతిరేక కార్యకలపాలలో పాల్గొన్నవారిపై నమోదు చేసే టాడా, పోటా లాంటి చట్టం కింద కేసులు ఇక్కడి వారిపై నమోదయ్యాయి. ఆయా కేసులలో అర డజన్ మంది జైలు శిక్షలకు గురై, డిల్లీలోని తీహార్, ముంబాయిలోని ఎరవాడ జైలులో శిక్షలు అనుభవించారు. నిజామాబాద్ జిల్లాను కేంద్రంగా చేసుకుని  కేంద్ర ప్రభుత్వం నిషేధించిన నాటి ఐఎస్ఐ, సిమి, పాఫులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నుంచి నేటి ఐసిఎస్  శిక్షణ కార్యకలాపాలు జరిపి, యువత తీవ్రవాదం వైపుమళ్లించిన దాఖలాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సారంగపూర్ లోని ఎస్టిడి బూత్ నుంచి పాకిస్థాన్ కు ఒక ఐఎస్ఐ ఎజెంటు నేరుగా మాట్లాడిన వ్యవహారం ఆనాడు కేంద్ర నిఘా సంస్థలు గుర్తించాయి. పాకిస్తానీయులు, బంగ్లా దేశీయులు తిష్ట వేసిన వారి ఆసుపాసులు లేకపోలేదు. నిజామాబాద్ జిల్లా బోదన్ లో 150 మందికిపైగా రోహింగ్యాలకు భారతదేశ పౌరులుగా పాస్ పోర్టులు దక్కించుకున్నారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంటినుంచి ఇంటర్నేషనల్ కాల్స్ ను లోకల్ కాల్స్ గా మార్చి పాకిస్తాన్, గల్ప్ దేశాలకు మాట్లాడిన ముఠా గుట్టురట్టైంది.

  • కేంద్ర నిఘా సంస్థల గుర్తిస్తేనే.. మొద్దు నిద్రవీడని లోకల్ నిఘా..

గత ఐదు సంవత్సరాల కాలంలో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (ఒకప్పటి నిషేధిత సిమి మాత్రు సంస్థ) కార్యకలాపాలు, శిక్షణా తరగతులు జరిగిన, రోహింగ్యాలకు పాస్ పోర్టులు పొందిన, ప్రస్తుతం నిషేధిత ఉగ్రవాదసంస్థ  ఐసిస్ కార్యకలాపాలు వెలుగు చూసిన  నిజామాబాద్ పోలీస్ శాఖ తీవ్రవాద కార్యకలాపాలపై నిఘాలో మొద్దు నిధ్ర వీడటం లేదు. జిల్లాలో స్పెషల్ బ్రాంచ్, ఇంటలిజెన్స్ విభాగాలు ఉన్నా లేనట్టుగా మారాయి. అవి ఫక్తు రాజకీయా కార్యకలపాల పై రిపోర్టులు ఇస్తున్నామని చెబుతున్నాయి. ఐతే పోలీస్ శాఖ కంటే అధికంగా పోలిటికల్ లీడర్ల సేవలలో(సర్వే) లకు పరిమితమయ్యాయనే  ఆరోపణలు మూటగట్టుకున్నాయి. ఒకప్పుడు కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగం ఉండగా ఉగ్ర కార్యకలాపాలు తగ్గాయని దాని ఉనికి లేకుండా పోయింది. నిజామాబాద్ జిల్లాలో నిషేధిత సంస్థలైనా నాటి ఐఎస్ఐ, సిమి,పాఫులర్ ప్రంట్ ఆఫ్ ఇండియా నుంచి నేటి ఐసిఎస్ కార్యకలాపాలు చాప కింద నీరులా జరుగుతున్న నిఘా సంస్థలు గుర్తించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి.  పాకిస్తానీయులు, బంగ్లా దేశీయులు స్థానికులుగా తిష్ట వేసిన వారి అసుపాసుల గుర్తించడంలో ఘోరంగా విఫలం అయిందా. స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది కారణంగానే జిల్లా నుంచి 150 మంది రోహింగ్యాలకు పాస్ పోర్టులు దక్కిన ఘన చరిత్ర ఉంది. నిజామాబాద్ జిల్లా మినీ ఇండియా. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు సరిహద్దు కలిగిన చిన్న జిల్లా. ఇక్కడ ఉత్తర, దక్షిణాధి రాష్ట్రాల ప్రజలు జీవిస్తున్నారు. అదే సమయంలో దేశ నలుమూలలకు రైల్వే లైన్ లతో పాటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారీకి వెళ్లు అంతర్ రాష్ట్ర జాతీయ రహదారి(44) ఉంది. దానితో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు అనువుగా ఉంది. కాని అదే సమయంలో దేశంలోని సీమాంతర ఉగ్రవాదానికి ఇందూర్ కేరాఫ్ గా నిలబడుతున్న నిఘా వర్గాలు విఫలం అవుతున్నాయి. ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ లు ఉండగా అందులో పనిచేస్తున్న వారు కుర్చీలకు పరిమితమై క్షేత్రస్థాయికి దూరమయ్యారు. మరికొంత మంది అధికారులు జిల్లా కేంద్రంలో పోలీస్ అధికారులకు తాబేదారుల్లా మారారని పక్తు అధికారుల మీదా శీకాయతులు చేయడమే పని అని  ఆరోపణలు ఉన్నాయి. ఇంకొందరు నిఘా విభాగం పేరు చెప్పి సెటిల్మెంట్ లు, వసూళ్ల రాయుళ్లుగా పేరు గడించిన వారిని కదపడం లేదని అందుకే  నిఘా విభాగాల పనితీరు నానాటికి తీసికట్టుగా మారుతోందని అపవాదు ఉంది. తెలంగాణలో హైద్రాబాద్ తరువాత ఐన్ఐఏ తన అత్యధిక పోకస్ చేసే ప్రాంతాలలో నిజామాబాద్ జిల్లాను చాల సార్లు గుర్తించిన లోకల్ పోలీస్ అధికారులు మాత్రం ఉగ్రకార్యకలాపాలపై ఉక్కుపాదం మోపే వ్యవహారం తమది కాదన్నట్టు వ్యవహరిస్తున్నారనే వాదనలు లేకపోలేదు. నిఘా వర్గాల ద్వార అసాంఘీక శక్తులు, సంఘ వ్యతిరేక శక్తుల పీచమనచాల్సిన పోలీస్ శాఖలో  వారి వల్లనే జిల్లా శాఖకు చెడ్డపేరు వస్తున్న పట్టించుకోకపోవడం శోచనీయం.

More articles

Latest article