భిక్కనూర్, బతుకమ్మ :
భిక్కనూరు మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బుధవారం మండల విద్యాధికారి రాజా గంగారెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాలకు చేరుకున్న ఎంఈఓ తరగతి గదిలో బోధనను పరిశీలించారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ విద్యార్థుల హాజరు పాఠ్యపుస్తకాలు తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందిస్తున్న విద్యా సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల వంటగది భోజనశాలను సందర్శించి మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. తాగునీటి సౌకర్యం పారిశుధ్యం మరుగుదొడ్ల పరిశుభ్రతను కూడా తనిఖీ చేశారు. పాఠశాలలోని మౌలిక సదుపాయాల పై ప్రధానోపాధ్యాయుడిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో ఏవైనా లోపాలు గుర్తిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల పోషకాహారం శుభ్రమైన తాగునీరు అందించడం ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.

