27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రయిక్ చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • పర్యాటకుల పై ముష్కరుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
  • బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రయిక్ చేయాలని బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ అన్నారు. బిసి ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో గురువారం గాంధీ చౌక్ లోని అమర వీరుల స్థూపం దగ్గర కాశ్మీర్ లోని పహల్గాం లో ఉగ్రవాదుల దాడి లో చనిపోయిన పర్యాటకులకు కొవ్వత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ పర్యాటకులను చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, కాశ్మీర్ లో ఉగ్రవాదులను తుదముట్టించాలని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని  ఉగ్రవాద స్తావరాలపై సర్జికల్ స్ట్రయిక్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ జిల్లా ప్రధాన కార్యదర్షి రాఘవాపురం గోపాలకృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షులు కంచరి రవికుమార్, కొట్టాల రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు, ఉపాధ్యక్షులు యు. విజయ్ కుమార్, గౌరవ సలహాదారులు రమణ స్వామి, జె శ్రీనివాస్, శంకర్, మధు సూధన్ తదితరులు పాల్గొన్నారు.

Surgical strikes should be carried out on terrorist camps.

More articles

Latest article