- వారంలో రెండో ఎస్ఐ సస్పెండ్
కామారెడ్డి, బతుకమ్మ : రామారెడ్డి ఎస్ఐ నరేష్ ను సస్పెండ్ చేస్తూ ఐజీ చంద్ర శేఖర్ రెడ్డిగురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రామారెడ్డి మండలం ఇస్సన్న పల్లి గ్రామానికి చెందిన బాధితులు ఫిర్యాదు చేసిన కేసులో అలసత్వం వహించిన రామారెడ్డి ఎస్ఐ నరేష్ ను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వుల వెలువడ్డాయి. గడిచని వారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి ఎస్ఐ వెంకటేశ్వర్లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, లేకపోతే చర్యలు తప్పవని కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర హెచ్చరించారు.