. . . మున్నూరు కాపు సంఘం కార్యదర్శి, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్
నిజామాబాద్ సిటి, బతుకమ్మ:
మున్నూరు కాపులు ఇంతకుముందు శీనన్న అధ్యక్షులుగా ఉన్నప్పుడు కలిసికట్టుగా ఉండి మున్నూరు కాపులు అభివృద్ధికి తోడ్పాటు అందించారో అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రతి ఒక్క మున్నూరు కాపు సోదరులు మున్నూరు కాపుల అభ్యున్నతికి తోడ్పాటు అందించాలని మున్నూరు కాపు సంఘం కార్యదర్శి, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు. జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రగతి నగర్ మున్నురు కాపు సంఘంలో దసరా సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహణలో భాగంగా ముఖ్య అతిథిగా జిల్లా మున్నూరు కాపు సంఘం సెక్రటరీలు మొదటి మేయర్ ధర్మపురి సంజయ్ , దారం సాయిలు , ఆకుల రాజేశ్వర్ ,16 సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గోన్నారు.. ఈ సమ్మేళనం ప్రతి సంవత్సరం దసరా తర్వాత మున్నూరు కాపు సోదరులతో కలిసి అలై బలై కార్యక్రమం నిర్వహింగా ధర్మపురి సంజయ్ మాట్లాడుతు…జిల్లా మునూరుకాపు సంఘం అభివృద్ధి కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగింది.
