. . . లక్ష్మి, కాకాతీయ, వరద కాలువలకు అవసరం మేర నీటిని వదలండి
. . . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
భీమ్ గల్, బతుకమ్మ :
వర్షభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా రైతులు వేసుకొన్న పంటలను కాపాడేందుకు ఎస్సారెస్పీ నీటిని ఇచ్చి బాల్కొండ నియోజకవర్గ ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని ఎస్సారెస్పీ ఎస్.ఈ ని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. మంగళవారు ఎమ్మెల్యే ఫోన్ లో ఆయనతో మాట్లాడారు. రైతుల నుంచి వస్తున్న డిమాండ్ తో పాటు సాగు నీళ్లు ఇచ్చే బాధ్యతను గుర్తు చేశారు. ఒక తడికి నీళ్లు ఇచ్చి, వర్షాలు పడితే ఆపేయాలని సూచించారు. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా నాలుగు డిమాండ్స్ ఉన్నాయని అవి, లక్ష్మీ కాలువ ద్వారా నీటి విడుదల చేయాలని, కాకతీయ కాలువ ద్వారా నీటిని కొంత విడుదల చేస్తే ఉప్లూర్ వద్ద గేట్లు వేసుకుంటారని, ఆ నీటికి పంట పొలాలకు మల్లించుకుంటారని తెలిపారు.అదే పద్ధతిన వరద కాలువలో కొంత నీటిని కూడా వదిలితే గేట్లు వేసి నీటిని ఆపుకుని పొలాలకు మళ్లించుకుంటారన్నారు.వీటితో పాటుగా పవర్ హౌజ్ నుండి వెళ్లే వృధా నీటిని గోదావరి నదిలోకి దిగువన వదిలితే పశువులకు తాగునీటికి ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే సూచించారు.కాబట్టి వెంటనే పై అధికారులకు,
ప్రభుత్వానికి రైతుల కోరికను వివరించి,ఎస్సారెస్పీ నుండి తగినంత నీటిని విడుదల చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు.
