డిల్లీ, బతుకమ్మ: డిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ’చరిత్రాత్మక విజయాన్నందించిన డిల్లీ ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి, సుపరిపాలన డిల్లీలో బీజేపీ విజయానికి కారణమన్నారు. డిల్లీని అభివృద్ధి చేసేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదలుకోబోమని ఈసందర్భంగా ఆయన మాటిచ్చారు‘.ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.
