మోర్తాడ్, బతుకమ్మ: రాష్ట్రీయ ఆవిష్కర్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా నిర్వహించిన మండల స్థాయి క్విజ్ పోటీలో సుంకేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన వర్నిత్ అనే విద్యార్థి మొదటి బహుమతి సాధించారు. మోర్తాడ్ విద్యాధికారి సమ్మిరెడ్డి చేతుల మీదుగా విద్యార్థికి ప్రశంస పత్రం మేమేంటోను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో ప్రతిభ దాగి ఉంటుందని దానిని గుర్తించి పట్టుదలతో శ్రమిస్తే ఉన్నత లక్ష్యాలు చేరుకోవచ్చని తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయు బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
