27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సిద్ధాంత గ్రంథానికి డాక్టరేట్ రావడం హర్షనీయం

Must read

📰 Generate e-Paper Clip

కవి, కంకణాల రాజేశ్వర్

 

భీమ్ గల్, బతుకమ్మ : వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన బొంబోతుల అరవింద్ గౌడ్ కు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి సిద్ధాంత గ్రంథానికి డాక్టరేట్ రావడం హర్షనీమని రామన్నపేట చరిత్ర రచయిత, కవి కంకణాల రాజేశ్వర్ అన్నారు.మంగళవారం అయన మీడియాతో మాట్లాడుతూ అరవింద్ గౌడ్ వృత్తిరీత్యా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సైంటిస్ట్(శాస్త్రవేత్త)గా 7 సంవత్సరాలుగా భారత ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నారని కంకణాల అన్నారు. హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో “పెట్రోలోజీ,జియో కెమిస్ట్రీ అండ్ అసోసియేటెడ్ మినరలైజేషన్ ఇన్ గ్రానిటాయిడ్స్ ఆఫ్ పీజీసీ ఇన్ అండ్ అరౌండ్ మాల్ ఏరియా ఆఫ్ ఇస్ట్రన్ దర్వారు కటింగ్ సౌత్ ఇండియా” అనే అంశంపై సిద్ధాంత గ్రంధాన్ని ఆయన సమర్పించారని,ఈ గ్రంథానికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ పట్టా ప్రకటించిందన్నారు.ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి.ప్రభాకర్, జియాలజీ విభాగానికి చెందిన శాఖాధిపతి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇంచార్జ్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి పర్యవేక్షకుడిగా వ్యవహరించారని,అనంతరం ప్రొఫెసర్ కే.శ్రీను బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ మరియు ప్రొఫెసర్ల బృందం, సహధ్యాయులు, తదితరులు అరవింద్ గౌడ్ ను అభినందించిన్నట్లు తెలిపారు .ఈ సందర్భంగా డాక్టరేట్ గ్రహీత అరవింద్ గౌడ్ మాట్లాడుతూ నేను డాక్టరేట్ సాధించడం సైంటిస్ట్ గా రాణించడం ఇంతటి ఉన్నత స్థితిలో ఉండడానికి ప్రధాన కారణం అన్నయ్య రవీందర్ గౌడ్, కుటుంబ సభ్యుల సంపూర్ణ ప్రోత్సాహం సహాయ సహకారం అన్నారు. ఈ సైంటిస్ట్ హోదాలోనే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో గల భారత ప్రభుత్వంలో సైంటిస్ట్ గా సేవలందించడం గర్వంగా ఉందని అన్నారు.

It is a joy to get a doctorate for Siddhanta Granth

More articles

Latest article