24.7 C
Hyderabad
Monday, August 3, 2026

బాధిత కుటుంబాలను పరామర్శించిన సునీల్ కుమార్

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండల కేంద్రంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మండల కేంద్రానికి చెందిన జైడి హన్మండ్లు ఇటీవల గుండె పోటుతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని ప్రకటించారు. బోగ భూషణ్ వాళ్ళ అమ్మ రాజుబాయ్ ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది. ఇటీవల దాడిలో గాయపడ్డ రొయ్యల సురేష్ ను పరామర్శించి ధైర్యాన్ని కల్పించారు. .అలాగే మండలంలోని పాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాబురావు ఇటీవల అడవి పంది దాడిలో గాయపడ్డాడు. ఆయనను పరామర్శించడం జరిగింది. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article