24 C
Hyderabad
Sunday, August 2, 2026

మొరం అక్రమ దందాకు బీజేపీకి సంబంధం లేదు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ: బిచ్కుంద  : బిచ్కుంద మండలంలో భారతీయ జనతా పార్టీ పేరును బద్నా చేస్తూ అక్రమ మొరం దందా నడిపిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ మండల నాయకులు అన్నారు.బిచ్కుందలో ఎవరైతే అక్రమం మొరం నడిపిస్తున్నారో వారికి భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. బిజెపిలో ఎలాంటి బాధ్యత లేకపోయినా తాము భారతీయ జనతా పార్టీ వాళ్ళం భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి పేరు, కామారెడ్డి ఎమ్మెల్యే పేరు చెప్పుకొని బీజేపీ నాయకులను బాద్నాం చేస్తున్నారని అన్నారు. అక్రమ మొరం దందాను కాంగ్రెస్ నాయకులతో కలిసి కాంగ్రెస్ కనుసైగల్లో  నడిపిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల జనరల్ సెక్రెటరీ జాదోవ్ పండరి, బిజెపి  మండల ప్రబారి శివాజీ పటేల్, బిజెపి మండల ఉపాధ్యక్షులు ధర్మానాయక్, అట్కరి గణపతి బిజెపి సీనియర్ నాయకులు మొగులుగొండ మారుతి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article