ఆదివారం ఆటవిడుపుగా..

మెండోరా, బతుకమ్మ: ఆదివారం సెలవు రోజు కావడంతో ఆటవిడుపుగా ప్రాజెక్టు అందాలని తిలకించడానికి పర్యాటకులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. ప్రాజెక్టు జల దృశ్యాలను, గోదావరి పరవాళ్ళు, ప్రాజెక్టు అందాలను తిలకిస్తూ చరవాణిలో సెల్ఫీలు దిగుతూ సంతోషంగా సేద తీరారు. స్థానిక నిజామాబాద్ జిల్లా ప్రజలే కాకుండా నిర్మల్, అదిలాబాద్, కరీంనగర్, కామారెడ్డి తదితర జిల్లాల నుంచి పర్యాటకులు రావడం జరిగింది. 8 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 54187క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్...