27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

అకస్మాత్తుగా ఎలక్ట్రిక్‌ బైకులో మంటలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ ,బాన్సువాడ : విద్యుత్తు బైకులు కాలిపోతున్న ఘటనలు దేశంలో పెరిగిపోతున్నాయి. తాజాగా బాన్సువాడ పట్టణంలోని బేతాళ స్వామి కాలనీ వద్ద మంగళవారం రాత్రి ఎలక్ట్రిక్‌ స్కూటీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో స్కూటీపై ఉన్న తండ్రి కూతురు అప్రమత్తమై వాహనాన్ని వదిలి పరుగులు పెట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అప్పటికే బైక్‌ చాలా వరకు కాలి దగ్ధమైంది.స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.

More articles

Latest article