23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎస్ఐఆర్ ధ్రువీకరణ పత్రం  ఇవ్వండి… లక్కీ డ్రా  ద్వార ఆకర్షనీయమైన బహుమతులు  పొందండి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 22 వ డివిజన్ కార్పొరేటర్  పులగం వైష్ణవి సుధా ప్రకటన

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాలను BLO కి సబ్మిట్ చేసి ధ్రువీకరణ పత్రం పొందిన వారికి లక్కీ డ్రా ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తామని నిజామాబాద్ బిజెపి  కార్పొరేటర్ ప్రకటన సంచలనంగా మారింది.. ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడానికి అధికార యంత్రాంగాలు అపసోపాలు పడుతున్నాయి.  ఈ నెల 24 గడువు తరుము కోస్తుంటే క్షేత్రస్థాయిలో అనుకున్న స్థాయిలో బిఎల్ఓ ఆధ్వర్యంలో పనులు జరగడం లేదు. పాలన యంత్రాంగం ఎంత దిశ నిర్దేశం చేసిన రాజకీయ పార్టీలు, స్వచ్చంధ సంస్థలు, ప్రజా సంఘాలు సహకరిస్తేనే ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతం అయ్యే అవకాశం ఉంది.  ఓటర్ల ద్వారా ప్రజా ప్రతినిధులుగా ఎదిగిన వారు వారి ఓటు హక్కు కల్పించేందుకు నిర్ధేశించిన ఎస్ఐఆర్ ప్రక్రియ ను భుజాన వేసుకున్నారు బిజెపి కార్పొరేటర్. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్ కార్పొరేటర్ పులగం వైష్ణవి సుధా తన డివిజన్ ఓటర్లకు “బంపర్ ఆఫర్” ప్రకటించారు. 22వ డివిజన్ కు చెందిన వారు ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాలను BLO లకు సబ్మిట్ చేసి ధ్రువీకరణ పత్రం పొందిన వారికి లక్కీ డ్రా నిర్వహించి ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తామని కార్పొరేటర్ ప్రకటించారు. సంబంధిత  పాంప్లెంట్ లను డివిజన్ లో ప్రచారం చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారాయి..

More articles

Latest article