నిజామాబాద్, బతుకమ్మ : ఐఎన్టీయూసీ 327 యూనియన్ టీజీఎన్పీడీసీఎల్ నిజామాబాద్ ఆధ్యర్యంలో నాయకులు రూరల్ ఎమ్మెల్యే ఆర్. భూపతి రెడ్డిని తన క్యాంపు కార్యాలయంలో శనివారం కలిశారు. డిచ్పల్లి డివిజన్ విభజన ప్రక్రియ, 01-02-1999 నుంచి 31-08-2004 వరకు నియామకమైన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం లాగా పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈమేరకు ఎమ్మెల్యేకు వారు వినతి పత్రం అందజేశారు. కలసిన వారిలో కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్ పూదరి గంగాధర్ , జిల్లా ప్రెసిడెంట్ కే . వేణుగోపాల్ రావు , ఎడ్ల నాగరాజు , అంజయ్య , మోహన్ పాల్గొన్నారు.
