26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కామారెడ్డి గ్రంథాలయంలో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు…

Must read

📰 Generate e-Paper Clip

భిక్కనూరు, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని, వసంత పంచమి వేడుకలను  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ రేడియో హౌస్ యజమాని మహిపాల్ కుమారుడు రోహిత్ జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వసంత పంచమి పండుగ విద్య, జ్ఞానం, కళలకు ప్రతీకగా నిలుస్తుందని, అలాగే సుభాష్ చంద్రబోస్ తన రచనల ద్వారా సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువత ఆయన జీవితం, సాహిత్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, పాఠకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

 

More articles

Latest article