బోధన్, బతుకమ్మ :
కల్దుర్కి గ్రామంలో జనని యూత్ సొసైటీ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నేతాజీని స్మరించుకుంటూ వక్తలు మాట్లాడుతూ స్వాతంత్య్ర కాంక్షను రగిలించిన సూర్యుడు, జయంతే కాని వర్ధంతి లేని అమరుడు, ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి బ్రిటిష్ పాలకుల గుండెల్లో నిద్రలేకుండా చేసిన వీరుడు అని కొనియాడారు. స్వాతంత్య్ర సాధనే తన జీవిత ధ్యేయంగా తపించిన భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బోరోల్ల జ్యోతి శంకర్, వార్డు సభ్యులు చంద్రకాంత్, మహేష్, అశోక్, రాజు, హన్మండ్లు, VDC చైర్మన్ గంగాధర్, మాజీ సర్పంచ్ మారయ్య, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్, గ్రామ పెద్దలు భాస్కర్ రెడ్డి, సాయిలు, ధర్మయ్య, జనని యూత్ సభ్యులు పవన్, బాలు, రామ్, సతీష్, గంగాధర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
