బాన్సువాడ , బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో మంగళవారం ఫుడ్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి శెట్టి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ ఈ ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. విద్యార్థులు తీసుకువచ్చిన వివిధ రకాలైన వంటకాలు నోరూరించాయి. ఈ సందర్భంగా చిన్నారులు తీసుకొచ్చిన వివిధ రకాల వంటకాలను సబ్ కలెక్టర్ రుచి చూసి అభినందించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య రక్షణలో ఆహరం పాత్ర ఎంతో ముఖ్యమైందని అన్నారు. సంతులిత ఆహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామని ఆమె తెలిపారు. చిన్నారులకు తల్లిదండ్రులకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి ఎటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఆమె తెలిపారు. వివిధ రకాల మొలకెత్తిన విత్తనాలు,పిండి వంటలు,జొన్న రొట్టె,రాగి జావ,రాగి సంకటి తో పాటు ఆరోగ్యకరమైనటువంటి వంటకాలను,వివిధ రకాల స్వీట్లను ఈ ఫుడ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అంజిరెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు లావణ్య, ఉపాధ్యాయులు పద్మ రేఖ వీణ సునీత లలిత సుష్మ సవితా తదితరులు పాల్గొన్నారు…
