27.3 C
Hyderabad
Friday, July 31, 2026

విద్యుత్ షాక్ తో ఏఎల్ఎం కు గాయాలు

Must read

📰 Generate e-Paper Clip

Injuries to ALM due to electric shock

. పరామర్శించిన ఎస్ ఈ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  విద్యుత్ షాక్ తో ఏఎల్ఎం కు గాయాలైన ఘటన మంగళవారం ఉదయం 6గంటలకు జిల్లా కేంద్రంలో  చోటు చేసుకుంది. నగరంలోని డి-8 సెక్షన్ లో ఏఎల్ఎం గా విధులు నిర్వర్తిస్తున్న నడిపి నాగన్న  మంగళవారం ఉదయం మరమ్మతులు చేయడానికి ట్రాన్స్ ఫార్మర్ పైకి ఎక్కాడు. ఏబీ స్విచ్ తెరుచుకోక పోవడంతో విద్యుత్ షాక్ తగిలి నేలపై పడిపోయాడు. ఒంటికి మంటలు అంటుకోవడంతో దగ్గరే ఉన్న లైన్ మెన్ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న నిజామాబాద్ డీఈఈ శ్రీనివాస్, ఏడీఈ వీరేశం బాధితునితో మాట్లాడి ఎస్ఈ కి సమాచారం ఇచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగన్నను ఎస్ఈ రవీందర్ పరామర్శించారు. ఘటన చోటుచేసుకున్న సమయంలో అక్కడే ఉన్న లైన్ మెన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుగైన చికిత్స కోసం బాధితుడిని వెంటనే హైదరాబాద్ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించగా, డీఈఈ అంబులెన్స్ లో తరలించారు.

More articles

Latest article