ఫుడ్ ఫేస్టివల్ ను ప్రారంబించిన సబ్ కలెక్టర్

బాన్సువాడ , బతుకమ్మ  : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో మంగళవారం ఫుడ్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి శెట్టి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ ఈ ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. విద్యార్థులు తీసుకువచ్చిన వివిధ రకాలైన వంటకాలు నోరూరించాయి. ఈ సందర్భంగా చిన్నారులు తీసుకొచ్చిన వివిధ రకాల వంటకాలను సబ్ కలెక్టర్ రుచి చూసి అభినందించారు. ఈ సందర్భంగా  సబ్ కలెక్టర్ మాట్లాడుతూ  ఆరోగ్య రక్షణలో ఆహరం పాత్ర ఎంతో ముఖ్యమైందని అన్నారు....