32.6 C
Hyderabad

సాలంపాడులో అంగన్‌వాడీ కేంద్రం, ఓటరు జాబితా సవరణపై సబ్ కలెక్టర్ సమీక్ష

Must read

📰 Generate e-Paper Clip

 

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ సబ్-కలెక్టర్ వికాస్ మహతో బోధన్ మండల్ సాలంపాడు గ్రామాన్ని సందర్శించి అంగన్‌వాడీ కేంద్రం కార్యకలాపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్‌తో ప్రీ-స్కూల్ విద్యా కార్యక్రమాల నిర్వహణ, పిల్లలకు పౌష్టికాహార పంపిణీ, పిల్లల వృద్ధి పర్యవేక్షణ, ఆరోగ్య, హాజరు రికార్డుల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఆరోగ్య సిబ్బందితో సమన్వయం, శిశు సంరక్షణ, మాతృ ఆరోగ్యంపై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలపై ఆరా తీశారు. తదనంతరం బూత్ లెవల్ ఆఫీసర్ తో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిని సమీక్షించారు. డీఎస్ఈ పెండింగ్ ఫైళ్ల స్థితి, పరిష్కార ప్రక్రియపై విచారణ చేసి, ఫారమ్‌లు 6, 7, 8 కు సంబంధించిన పెండింగ్ క్లెయిమ్స్, అభ్యంతరాలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

More articles

Latest article