27.5 C
Hyderabad
Friday, July 31, 2026

బీసీ లకు బడ్జెట్ లో న్యాయం జరుగలేదు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లో నీళ్లు, నిధులు, నియామకాలు అనే సిద్దాంతంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న బీసీలకు ఎక్కడ బడ్జెట్ లో బీసీలకు న్యాయం జరగలేదని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ 20% కూడా ఖర్చు చేయలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి రాకన్న ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో బడ్జెట్లో సంవత్సరానికి 20000 వేల కోట్లు కేటాయించి, బీసీలకు న్యాయం చేస్తామని మాయ మాటలు చెప్పి, అధికారం లోకి వచ్చి 26 నెలలు గడిచినా ఖర్చు చేసింది కేవలం 5000 వేల కోట్లు మాత్రమే అని పేర్కొన్నారు. 2024-25 లో నిరుద్యోగులకు రాజీవ్ యువ శక్తి పథకం, బ్యాంకుల ద్వారా అప్పు ఇస్తామని ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఎందుకు బీసీల మీద ఇంత కక్ష్య అని అన్నారు. కనీసం వచ్చే బడ్జెట్ సమావేశం లోపు రాజీవ్ యువ శక్తీ పథకం ద్వారా బీసీ నిరుద్యోగులకు రుణాలు ఇప్పిoచి ఆదుకోవాలని తెలియజేసారు. అంతే గాక రానున్న బడ్జెట్ లో బీసీల సంక్షేమానికి 50000 వేల కోట్లు కేటాయించి, బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి ప్రభుత్వానికి డిమాండ్ చేసారు.

More articles

Latest article