24.7 C
Hyderabad
Monday, August 3, 2026

 కాలుష్యం కోరల్లో చదువులు

Must read

📰 Generate e-Paper Clip

. . . విద్యార్థులు ముక్కు మూసుకోని చదువుకోవాల్సిందే

 

. . . వాయు కాలుష్యంపై పట్టించుకోని అధికారులు

 

భిక్కనూర్, బతుకమ్మ :

 

పరిశ్రమల వలన ప్రగతి. పరిశ్రమల వలన ఉపాధి… పరిశ్రమల వలననే అభివృద్ధి అనేది నానానికి ఓకవైపు మాత్రమే. దానికి కారణం లేకపోలేదు. ఒక దేశం, ఓ రాష్ట్రం, ఓ ప్రాంతం డేవలప్ మెంట్ అంత పరిశ్రమల కారణంగానే జరుగుతుంది. అందుకే పరిశ్రమల స్థాపనకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తుంటాయి. పరిశ్రమల స్థాపన సమయంలో గ్రామ పంచాయతీ మొదలుకుని, రెవిన్యూ, కాలుష్య నియంత్రణ మండలి, నీటిపారుధల శాఖ, అగ్నీమాపక శాఖ, కార్మీక శాఖాలాంటి పద్దేనిమిది శాఖల అనుమతులు తప్పనిసరి. కాని అనుమతుల కోసం అన్నింటికి తలుపే యాజామాన్యాలు వాటి అమలులో మాత్రం చిత్తశుద్ధి చూపడం లేదు. కామారెడ్డి జిల్లా  భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో గల ఫార్మా కంపెనీలు ఉండడంవల్ల విద్యార్థుల చదువులకు ఆటంకంగా మారుతుంది. దీంతో విద్యార్థులు గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారు. కాలుష్యంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా వాయు కాలుష్యం వల్ల శ్వాసకోశ సమస్యలు అలసట ఏకాగ్రత లోపించడం  జరుగుతున్నాయి. ఇది వారి విద్యా ప్రగతిని కూడా ప్రభావితం చేస్తుంది.

Studies in the midst of pollution

. . .  విద్యార్థులకు నానా  ఇబ్బందులు

జంగంపల్లి గ్రామంలోని మహాత్మ జ్యోతిబాపూలే స్కూల్ చెంతనే పరిశ్రమల నడుస్తున్నాయి. వాతావరణం కలుషితం అవుతుండడంతో విద్యార్థుల ఆరోగ్యలపై ప్రభావం పడుతుందని   విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు చెందుతున్నారు.ఈ ఫార్మా కంపెనీల నుంచే వేదజల్లే పోగ వల్ల దుర్వాసన, గాలి కాలుష్యం ఏర్పడి విద్యార్థులు,  ఇబ్బంది పడుతున్నారు. తలనొప్పితో చదువులపై దృష్టి సాధించలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య సమస్యలు విద్యా ప్రమాదం ఉబ్బసం,ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, అలర్జీ, గుండె జబ్బులు మెదడు అభివృద్ధిని లోపించడం వంటివి జరుగుతుంటాయని వైధ్యులు చెబుతున్నారు. విద్యార్ధులు చదువుకోసం వచ్చి కాలుష్య కాసారం బారిన పడుతున్నారు అని విద్యార్ధుల తల్లిధండ్రులు వాపోతున్నారు. ప్రధానంగా బడుగు, బలహినవర్గాల పిల్లలు చదివే స్కూల్ వద్ధ ఈ వ్యవహరం సాగుతున్న అధికార యంత్రాంగాలు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాయి.

. . . పంటల దిగుబడి తగ్గడంతో రైతుల కుదేలు….

ఈ ఫార్మా కంపెనీల వల్ల రైతులు కూడా పంటలు దిగుబడి తగ్గుతున్నాయని రైతులు వాపోన్నారు. వాయు కాలుష్యంతో విద్యార్ధులు ఇబ్బందులు పడుతుంటే… జల కాలుష్యం పంటల దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయి. గతంలో కాచాపూర్ చెరువు నీళ్లు కలుషితమై మత్స్య సంపధ నాశనం అయంది . దానితో గ్రామస్థుల అభ్యంతరాలతో నీటిని భూగర్బంలొకి పంపుతుండటంతో ఇప్పుడు దాని ప్రభావం వ్యవసాయం పై పడుతుంది. దానితోపాటు పరిశ్రమలకు వచ్చే బారీ వాహనాల వలన రోడ్లు చెడిపోవడం వల్ల పంట పొలాలకు పోలేని పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రోడ్లు బాగు చేయాలని ఈ ఫార్మా కంపెనీల పైన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Studies in the midst of pollution

 

More articles

Latest article