. . . ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ ఓకటవ టౌన్ పోలీసులు తొమ్మిది నెలల పసికందును విక్రయించినందుకు ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణచేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ హినా అలియాస్ సీమా, షరిప్లు భిక్షాటన చేస్తూ నిజామాబాద్ నగరంలో జీవిస్తున్నారు. వారికి 9 నెలల కొడుకుఉన్నాడు. ఇద్దరు భార్యాభర్తలు కాకపోయిన సహజీవనం ద్వారా పుట్టిన బాబును నిజామాబాద్నగరానికి చెందిన ఒక మహిళ మధ్యవర్తి ద్వారా రూ.1.20 లక్షలకు ఒ వ్యక్తికివిక్రయించారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో భిక్షాటన చేస్తున్నఇద్దరి వద్ద ఉండాల్సిన బాబు కనిపించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు 1098 కుఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారి సౌజన్య ఫిర్యాదు మేరకు విచారించినట్లు ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. ఈ నెలలో ఇద్దరిని అదుపులోకితీసుకుని విచారించడంతో బాబును విక్రయించినట్లు ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసినట్లుతెలిపారు. బాబును విక్రయించిన మధ్య వర్తి మహిళతో పాటు, కొనుగోలు చేసిన వ్యక్తులకోసం గాలిస్తున్నట్లు ఎస్ హెచ్ ఓ తెలిపారు.
