తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి శోభారాణి
కామారెడ్డి, బతుకమ్మ : విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి అని మర్కల్ గ్రామం నందు ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి శోభారాణి విద్యార్థులకు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్ మర్కల్ గ్రామం నందు ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండడంతో పాటు, సమాజం నుండి మాదకద్రవ్యాల నిర్మూలనకు ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు అందరూ కృషి చేయాలని అన్నారు. డ్రగ్స్ వినియోగంతో శారీరకంగా, మానసికంగా ,ఆర్థికంగా నష్టం జరుగుతుందని తెలిపారు. అందుకు అనుగుణంగా కళాశాలలో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఇటీవల మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ జూబ్లీహిల్స్ హైదరాబాదులో జరిగిన యాంటీ నార్కోటిక్ బ్యూరో వారు నిర్వహించిన సమావేశానికి కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం అధికారి చంద్రకళ.బి హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కళాశాలలో యాంటీ నార్కోటిక్ బ్యూరో రూపొందించిన గోడ ప్రతుల్ని ఆవిష్కరించారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం అధికారి చంద్రకళ ,విద్యార్థులతో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రావణి, ఉదయని, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
