- ఎల్లారెడ్డిపేట ఎస్ఐ కే.రాహుల్ రెడ్డి
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: విద్యార్థులు డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ కే.రాహుల్ రెడ్డి తెలిపారు.నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని,డ్రగ్స్ నిరోధానికి తాము కూడా కృషి చేస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాల వినియోగం,విక్రయం నకు సంబంధించి పోలీసులకు సమాచారం అందించి డ్రగ్స్ మహమ్మారి నిరోధానికి విద్యార్థులు, వారి తల్లి దండ్రులు, కుటుంబసభ్యులు,విద్యార్థుల స్నేహితులు కృషి చేయాలని ఎస్ ఐ సూచించారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట పోలీస్ సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.