ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా మోడీ కానుక అనే పేరుతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ బడిలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా 20,000 సైకిళ్లు పంపిణీ చేస్తున్నారనీ ఎల్లారెడ్డిపేట బిజెపి మండల అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గొల్లపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు 34 సైకిల్లను బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాలకు సమయానికి వెళ్లేందుకు బండి సంజయ్ కుమార్ ముందు జాగ్రత్తగా ఆలోచించి విద్యార్థులకు సైకిల్ చేస్తున్నారని తెలిపారు.. విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సైకిల్లను ఉపయోగించుకొని పాఠశాలకు సమయానికి వెళ్లి మంచిగా చదివి అత్యున్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కృష్ణహరి, ప్రధానోపాధ్యాయులు మురళి, బీజేపీ మండల అధ్యక్షులు రేపాక రామచంద్ర రెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా కన్వీనర్ పొన్నాల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శులు దాసరి గణేష్,నంది నరేష్,సీనియర్ నాయకులు వంతడుపుల సుధాకర్,పిట్ల శ్రీశైలం, బుగ్గారెడ్డి, గాల్ రెడ్డి, ఉడుగుల యాదగిరి, రంజిత్,గంట బాలకృష్ణ,మానుక కుమార్,చరణ్,దండు నవీన్, బాలాగౌడ్,శాగ లక్ష్మణ్, మధు గౌడ్,కిరణ్ నాయక్, గణేష్ నాయక్, రమేష్ నాయక్,ఆకుల సాగర్, కడుకల అరవింద్, సాజిద్, ఉగేందర్,దండు నర్సయ్య, మహిళా మోర్చా అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ, జొనకంటి తేజశ్రీ,చల్ల మంజుల,విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.