29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

భీంగల్ జీజేసీలో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ

Must read

📰 Generate e-Paper Clip

భీంగల్, బతుకమ్మ : భీమ్ గల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో బుధవారం మాదకద్రవ్యాల నివారణ వ్యతిరేక  ప్రతిజ్ఞకార్యక్రమం ను నిర్వహించారు. మాదకద్రవ్యాల నిరోధన అనే విషయంపై విద్యార్థిని, విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఇట్టి కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఏ ఒక్కరు కూడా ఈ మాదకద్రవ్యాల వలలో పడకుండా వాటికి బలికాకుండా ఉండాలని కోరుతూ, ఏ ఒక్కరు కూడా ఇటువంటి చెడు వ్యసనాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరిని మేలుకొలుపుతూ, డ్రగ్స్ నివారిత గ్రామాలుగా మార్చడంలో ప్రతి ఒక్కరి చేయూత అవసరం కాబట్టి మీరందరూ ఈ డ్రగ్స్ ను నివారించడంలో పాలు పంచుకోవాలని విద్యార్థిని విద్యార్థులతో కోరారు. ఇందులో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ అధ్యక్షతనలో భాగంగా పోలీస్ అధికారులు, కళాశాల అధ్యాపక బృందం,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Anti-drug pledge at Bheengal GJC

More articles

Latest article