29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

రాష్ట్రస్థాయి అండర్–16 వాలీబాల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

Must read

📰 Generate e-Paper Clip

నందిపేట్, బతుకమ్మ :

 

కమ్మర్ పల్లిలో వచ్చే నెలలో జరగనున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు నిజామాబాద్ జిల్లా జట్టును క్యాంపు కోసం ఎంపిక చేశారు. ఈ నిజామాబాద్ జట్టుకు జక్రాన్‌పల్లి లో పది రోజుల పాటు ప్రత్యేక శిక్షణ క్యాంపు నిర్వహించి, అనంతరం కమ్మర్‌పల్లి లో జరగబోయే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు పంపనున్నారు. ఈ క్యాంపుకు శ్రీ గీతా కాన్వెంట్ హై స్కూల్, నందిపేట్ నుండి తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థినిలు ఎర్రోళ్ల శృతజ్ఞ, రెంజర్ల శ్రీవల్లి, నంగి శ్రీనిది, విద్యార్థి పోతుగంటి శ్రీహర్ష ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ కానూరి గంగాసాగర్, డైరెక్టర్ కానూరి శోభ, ప్రధానోపాధ్యాయులు చెలిమెల గంగాభూషణ్, వ్యాయామ ఉపాధ్యాయులు మర్రిపల్లి సుమలత, గాండ్ల ముత్యం అభినందించారు.

More articles

Latest article