రాష్ట్రస్థాయి అండర్–16 వాలీబాల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

నందిపేట్, బతుకమ్మ :   కమ్మర్ పల్లిలో వచ్చే నెలలో జరగనున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు నిజామాబాద్ జిల్లా జట్టును క్యాంపు కోసం ఎంపిక చేశారు. ఈ నిజామాబాద్ జట్టుకు జక్రాన్‌పల్లి లో పది రోజుల పాటు ప్రత్యేక శిక్షణ క్యాంపు నిర్వహించి, అనంతరం కమ్మర్‌పల్లి లో జరగబోయే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు పంపనున్నారు. ఈ క్యాంపుకు శ్రీ గీతా కాన్వెంట్ హై స్కూల్, నందిపేట్ నుండి తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థినిలు ఎర్రోళ్ల శృతజ్ఞ, రెంజర్ల శ్రీవల్లి, నంగి శ్రీనిది, విద్యార్థి...