29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య వైద్య చికిత్సల కోసం రూ. 10 లక్షలు మంజూరు

Must read

📰 Generate e-Paper Clip

. . . కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

విధి నిర్వహణలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తులు కారుతో ఢీకొట్టిన సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు వైద్య చికిత్సల కోసం ప్రభుత్వం రూ.10 లక్షలు తక్షణ సహాయం కింద మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. కానిస్టేబుల్ సౌమ్య ప్రస్తుతం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆమెకు మరింత మెరుగైన వైద్య సేవల కోసం అవసరమైన తోడ్పాటును అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. సౌమ్య ఆరోగ్య పరిస్థితి గురించి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు వాకబు చేస్తూ సమాచారం తెలుసుకుంటున్నారని, మెరుగైన వైద్యం అందించాల్సిందిగా నిమ్స్ ఆసుపత్రి వర్గాలను ఆదేశించారని అన్నారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వ యంత్రాంగం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని కలెక్టర్ భరోసా కల్పించారు.

More articles

Latest article