రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఖోఖో పోటీలకు ఎంపికైన విద్యార్థులు
నందిపేట్ బతుకమ్మ :
నందిపేట్ మండల కేంద్రంలోని శ్రీ గీతా కాన్వెంట్ హై స్కూల్ నందు 9వ తరగతి చదువుతున్న వన్నెల్ కె గ్రామానికి చెందిన రాజారం స్పందన ఈనెల 18 నుంచి 20 వ తేదీ వరకు మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట లో జరగనున్న 35 వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ ఖోఖో పోటీలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తరపున ప్రాతినిత్యం వహించనుంది. జనవరి 6 వ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి ఖో ఖో పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కానూరి గంగాసాగర్, ప్రధానోపాధ్యాయులు చెలిమెల గంగా భూషణ్, డైరెక్టర్ కానూరి శోభ, వ్యాయామ ఉపాధ్యాయులు ముత్యం,సుమలత,లిఖిత మరియు పాఠశాల సిబ్బంది అభినందించారు.