నందిపేట్ పోలీస్ వారి ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ పోగ్రాం

0 7,164

నందిపేట, బతుకమ్మ :

 

నందిపేట మండల కేంద్రంలో ఎస్సై శ్యామ్ రాజ్ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని శుక్రవారం మండల అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్యామ్ రాజ్ మాట్లాడుతూ రోడ్డు భద్రత కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ముందుగా అధికారులు ముందుకు రావాలని శుక్రవారం రోజున ప్రభుత్వ అధికారులతో ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే ప్రతి పౌరుడు ఖచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు. మద్యం సేవించి, బైకులు, కార్లు ఇతర వాహనాలు నడపరాదని, పిల్లలకు బైకులు ఇవ్వకుండా క్రమశిక్షణ పాటించే విధంగా ఉండాలని అలాగే ప్రతి టూ వీలర్ పై హెల్మెట్ ధరించాలని అన్నారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.