26.3 C
Hyderabad
Monday, August 3, 2026

పోషకాహారం, సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ సిటి : సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పట్టణ ఆరోగ్య కేంద్రం అర్సపల్లి పరిధిలోని నలంద డిగ్రీ కళాశాల,ఖలీల్ వాడి నందు సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు ఆరోగ్య అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భగా జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు ఘనపూర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని,చికిత్స కన్నా నివారణ మిన్న,దోమల నియంత్రణ ద్వారా దోమలు పుట్టకుండా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటూ దోమల ద్వారా వ్యాపించే మలేరియా, ఫైలేరియా ,డెంగ్యూ, చికున్ గున్యా,మెదడువాపు మొదలగు వ్యాధుల నియంత్రణతో పాటు ప్రజలందరూ దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా ప్రజారోగ్యంలో భాగంగా వ్యక్తిగత ఆరోగ్య శ్రీ,కుటుంబ ఆరోగ్యం,సామాజిక ఆరోగ్యం,ఆధ్యాత్మిక ఆరోగ్యం ప్రధానమైనవని,సీజనల్ వ్యాధుల్లో ప్రధానంగా వర్షాకాలంలో వ్యాపించే వ్యాధులు పై దృష్టి సారించాలన్నారు. ప్రతి శుక్రవారం (ఫ్రైడే డ్రైడే,శుభ్రంగా కడిగి ఎండపెట్టి మరుసటి రోజు నీటిని పట్టుకోవాలని లేనిచో దోమలు,డెంగీ దోమలు అందులో పెరిగి ఇ ళ్లలో నివసించే వారికి కుట్టడంతో డెంగ్యూ వ్యాధి ప్రబలునని చెప్పారు. అదేవిధంగా సీజనల్ వ్యాధులు ముఖ్యంగా కలిసితమైన ఆహారం,కలుషితమైన నీరు,ఈగలు,దోమల ద్వారా, కలుషితమైన చేతి వేళ్ల ద్వారా వ్యాపిస్తాయన్నారు. ముఖ్యంగా డయేరియా అతీసారా,టైఫాయిడ్, నీళ్ల విరోచనాలు,ఇలాంటి వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ స్వప్నతో పాటు ఆర్సపల్లి పట్టణ ఆరోగ్యకేంద్ర స్వరూప, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article