పోషకాహారం, సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన
బతుకమ్మ, నిజామాబాద్ సిటి : సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పట్టణ ఆరోగ్య కేంద్రం అర్సపల్లి పరిధిలోని నలంద డిగ్రీ కళాశాల,ఖలీల్ వాడి నందు సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు ఆరోగ్య అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భగా జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు ఘనపూర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని,చికిత్స కన్నా నివారణ మిన్న,దోమల నియంత్రణ ద్వారా దోమలు పుట్టకుండా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటూ దోమల ద్వారా వ్యాపించే మలేరియా, ఫైలేరియా ,డెంగ్యూ, చికున్ గున్యా,మెదడువాపు...