30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

మహిళా శక్తి సమీక్ష సమావేశం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఇందల్వాయి : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో గురువారం ఏపిఎం సువర్ణ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.అనంతరం ఏపిఎం సువర్ణ మాట్లాడుతూ మండలంలోని 24 గ్రామాలలో డ్వాక్రా సంఘాలు ఉన్నందున బ్యాంక్ లింకేజీ చేయించి శ్రీనిధి రుణాలు వినియోగించుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ మహిళా శక్తి కార్యక్రమంలో పాడి గేదలు, నాటు కోళ్లు పెంపకం, న్యూ ప్రైజేస్ ఫుడ్ ప్రాసెసింగ్,యూనిట్లు తదితర కార్యక్రమాలను సంఘ సభ్యులు వినియోగించుకోవాలని సూచించారు .ఈ కార్యక్రమంలో మండలంలోని 24 గ్రామ సంఘాల డ్వాక్రా మహిళ అధ్యక్షులు,  సీసీలు,వివోఏలు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article