అనుమానాస్పదంగా విద్యార్థిని మృతి
సిద్దిపేట, బతుకమ్మ : కస్తూర్బా గాంధీ పాఠశాలలోని విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన గుర్రం తిరుపతి రెడ్డి, శ్రావణి, దంపతుల కుమార్తెలు వర్ష, హర్షినిలు సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామ శివారులో గల కస్తూర్బా గాంధీ పాఠశాలలో చదువుతున్నారు. వర్ష తొమ్మిదో తరగతి చదువుతుండగా, హర్షిని ఏడో తరగతి చదువుతోంది. రోజులాగే రాత్రి భోజనం చేసిన అనంతరం తోటి స్టూడెంట్స్ తో కలిసి హాస్టల్లో ఆడుకున్న హర్షిణి...