26.3 C
Hyderabad
Monday, August 3, 2026

కోటగల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ :  బడిబాట కార్యక్రమంలో భాగంగా 4వ రోజు సోమవారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కోటగల్లి (శంకర్ భవన్) పాఠశాల పరిధిలోని కోటగల్లీలో బడి ఈడు, డ్రాప్ అవుట్, ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రధానోపాధ్యాయులు రామచందర్ గైక్వాడ్ ఆధ్వర్యలో ఉపాధ్యాయులు ఇంటింటిని సందర్శించారు. అనంతరం అంగన్వాడి సెంటర్ ను సందర్శించి అంగన్వాడి టీచర్ సహకారంతో ముగ్గురు పిల్లలను గుర్తించి, తర్వాత ఇందిరా చౌక్, భగత్ సింగ్ చౌక్ లో ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను పంపాలని ఫ్లెక్సీ ప్రదర్శించి కరపత్రాలను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాల గురించి ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. స్పందించిన తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల కే పంపిస్తామని హామీ ఇచ్చినట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు.ఇంటింటి ప్రచారంలో ఉపాధ్యాయులు దయానంద్, ప్రసన్న, లక్ష్మి, మమత, ము కుంద్, సంతోష్, నందిని, ఎండిఎం ఇంచార్జి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article