మోర్తాడ్, బతుకమ్మ: విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేస్తున్నారని మోర్తాడ్ విద్యాధికారి సమ్మీ రెడ్డి అన్నారు. మోర్తాడ్ మండలంలోని షేట్ పల్లీ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేసి వంద శాతం ఉత్తర్ణత సాధించాలని కోరారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరిస్తున్న పాఠాలను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనం తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
