బాల్కొండ, బతుకమ్మ: ప్రభుత్వ జూనియర్ కళాశాల బాల్కొండ లో మంగళవారం మహిళా, శిశు సంక్షేమ, వయోవృద్ధుల శాఖ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించాడం జరిగింది. కార్యక్రమంలో లింగ సమానత్వం, లింగ వివక్ష వంటి అంశాలపై అవగాహన కల్పించారు. మహిళలపై హింసను ముగించడంలో పురుషుల పాత్ర, హింసను గమనించినప్పుడు స్పందించే విధానం, గృహహింస, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నిలబడే బాధ్యత, మహిళల భద్రత, గౌరవం కోసం మద్దతు ఇవ్వడానికి ముందుండాలని పేర్కొన్నారు, బీ బీ బీ పీ స్కీమ్స్ గురించి, సుకన్య సమృద్ధి యోజన స్కీం, మిషన్ వత్సల్య స్కీం గురించి పుష్ప ఫైనాన్సియల్ సౌమ్య, కవిత జెండర్ స్పెషలిస్ట్ వివరించడం జరిగింది. సఖి కేంద్రం సెంటర్ అడ్మినిస్ట్రేటర్ భాను సఖి కేంద్రం సేవలు, హెల్ప్ లైన్ నెంబర్లు గురించి వివరించారు. ప్రభుత్వ కార్యాలయంలో కార్యాలయంలో పనిచేసే మహిళ ఉద్యోగులపై ఏమైనా సమస్యలపై ఒక కమిటీని నియమించడం జరిగినది అనిత ఆధ్వర్యంలో ఈ కమిటీ పని చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రజిద్దీన్ అస్లాం ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ మురళి, అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
