మోర్తాడ్, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడపడుచులకు అందించిన ఇందిరమ్మ చీరలు అందంగా, ఆకర్షణీయంగా, నాణ్యతతో ఉండడంతో సంతోషంగా ధరిస్తున్నారు. మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలో గల ఆడపడుచులు ఇందిరమ్మ చీరలను ధరించి తీర్థయాత్రలకు బయలుదేరారు. పలు దేవాలయాలను దర్శించుకొవాలని వెళ్ళారు. కార్యక్రమంలో బిలాల శ్రీనివాస్, గురజాల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
