25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆర్టీసీలో సమ్మె సైరన్

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చిన జేఏసీ

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ ఆర్టీసీలో తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఏసీ నాయకులు సమ్మెకు సిద్దమయ్యారు. ఈ మేరకు యాజమాన్యానికి సమ్మె నోటీసులను ఇచ్చారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను చేపట్టాలని, 2021 వేతన సవరణ చట్టం 30 శాతం ఫిట్ మెంట్ తో అమలు చేయాలని సమ్మె సైరన్ మోగించారు. ఆర్టీసీకి రావాల్సిన 2500 కోట్ల బకాయిలను విడుదల చేయాలని, ప్రతి నెల మహాలక్ష్మీ పథకం కింద 350 కోట్లను కోతలు లేకుండా చెల్లించాలని కోరారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలను ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలను జరుపాలని డిమాండ్ చేశారు.

More articles

Latest article