27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

దుకాణం యజమానిపై కఠిన చర్యలు చేపట్టాలి 

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా దళిత ఐక్య సంఘటన ప్రెసిడెంట్ సావెల్ గంగారాం 

భీమ్ గల్, బతుకమ్మ : దుకాణం లో పని చేస్తున్న దళిత యువకుడి తో పాటు యువకుని తల్లిని దూషించిన ఆ దుకాణం యజమానిని కఠినంగా శిక్షించాలని జిల్లా దళిత ఐక్య సంఘటన ప్రెసిడెంట్ సావెల్ గంగారాం డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఈ విషయమై ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. తన షాప్ లో పని చేస్తున్న దళిత యువకున్ని, ఆయన తల్లిని షాప్ యజమాని ఇంటికి పిలిపించుకొని దాడి చేసి దూషించడం జరిగిందన్నారు. ఈ ఘటన ఈ నెల 3న జరగగా 4న భాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారని, ఆయన పేర్కొన్నారు. ఫిర్యాదు ఇచ్చి 20 రోజులు అవుతున్న పోలీసులు రాజీ మార్గం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని చెబుతున్నారే తప్ప కేసు నమోదు చేయడం లేదని ఆరోపించారు. పోలీసులు వెంటనే స్పందించి భాధితుల ఫిర్యాదు మేరకు దుకాణం యజమాని పై కేసు నమోదు చేయాలని లేదంటే భీమ్ గల్ బంద్ కు పిలుపు నిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్ లో దళిత ఐక్య సంఘటన నాయకులు పులి సాయిరామ్, గడాల ప్రసాద్, రాజ్ కుమార్, కూనే రమేష్, మేకల శ్రీనివాస్, అనిల్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article