నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి చర్యలు చేపట్టాలి

0 8,588

 

. . . ఇచ్చిన హామీల అమలు కొరకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని సీపీఎం డిమాండ్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చి ఇంతవరకు దానిపై పురోగతి లేకపోవడం శోచనీయమని, ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లో నిధులను కేటాయించి నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి చర్యలు చేపట్టాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. శుక్రవారం సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 16 నుండి జరిగే బడ్జెట్ సమావేశంలో జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కొరకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ కి అదనపు కోర్సులను ప్రవేశపెట్టడంతో పాటు 100 కోట్ల నిధులను కేటాయించాలని, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని 1000 పడకలకు పెంచటంతో పాటు వివిధ రకాల ల్యాబ్లను నిర్వహించటానికి కావలసిన టెక్నికల్ సిబ్బందిని, వైద్యులను, సిబ్బందిని నియమించుకోవటానికి కావలసిన నిధులను కేటాయించాలని ఆయనన్నారు. అదే విధంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు నెలకొల్పుకోవడానికి కేటాయించటం మూలంగా జిల్లా నుండి దుబాయి, అరబ్బు తదితర దేశాలకు వలస వెళ్తున్న ఉపాధి కొరకు జరిగే వలసలను ఆపటానికి ఉపాధి అవకాశాలను పెంచాలని అందుకు నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. నిజాం సాగర్, ప్రాజెక్టులను మరమ్మతులు చేయటంతో పాటు చివరి ఆయకట్టు రైతులకు నీరు అందే విధంగా చర్యలు చేపట్టడానికి, జిల్లాలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్వహణకు తగిన నిధులను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి తగిన నిధులను కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులకు జీవన భృతి, కౌలు రైతులకు సంవత్సరంకు 12 వేల రూపాయలు, మహిళలకు నెలకు 2500 రూపాయల హామీ, నిరుద్యోగ భృతి తదితర హామీలను అమలు చేయడం కోసం నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు నల్వాల నరసయ్య, అంజయ్య, శేఖర్ గౌడ్, రాజు, సుచిత్ తదితరులు పాల్గొన్నారు.

 

Steps should be taken to reopen the Nizam Sugar Factory.

Leave A Reply

Your email address will not be published.