నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి చర్యలు చేపట్టాలి

  . . . ఇచ్చిన హామీల అమలు కొరకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని సీపీఎం డిమాండ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చి ఇంతవరకు దానిపై పురోగతి లేకపోవడం శోచనీయమని, ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లో నిధులను కేటాయించి నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి చర్యలు చేపట్టాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. శుక్రవారం సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...