29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

 

బాన్సువాడ, బతుకమ్మ  : ఎండా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నర్సరీ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఎండిపోకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రశాంతికి సూచించారు. గురువారం బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలో ఆమె ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె నర్సరీని పరిశీలించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను ఉపాధి హామీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. అనంతరం గ్రామంలోని పల్లె దావఖాన, అంగన్వాడి కేంద్రం, ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. దవాఖానలో రోగులకు అందుతున్న సేవలను వైద్యులతో అడిగి తెలుసుకున్నారు. డిస్పెన్సరీలో అందుబాటులో ఉన్న మందులను పరిశీలించారు. అంగన్వాడి కేంద్రంలో గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాలు సక్రమంగా అందిస్తున్నారా అని అంగన్వాడి టీచర్ తో ఆరా తీశారు. గ్రామంలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని, మురికి కాలువలో నీరు నిలువ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఆమె వెంట ఎంపీడీవో బషీరుద్దీన్, ఎంపివో సత్యనారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి సృజన్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ గంగాధర్, తదితరులు ఉన్నారు.

More articles

Latest article