మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలి
బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి బాన్సువాడ, బతుకమ్మ : ఎండా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నర్సరీ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఎండిపోకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రశాంతికి సూచించారు. గురువారం బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలో ఆమె ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె నర్సరీని పరిశీలించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను ఉపాధి హామీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. అనంతరం గ్రామంలోని పల్లె దావఖాన, అంగన్వాడి...